Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడ్‌ ఇన్‌ తెలంగాణను బెంచ్‌మార్క్‌గా మార్చాలి

మేడ్‌ ఇన్‌ తెలంగాణను బెంచ్‌మార్క్‌గా మార్చాలి

- Advertisement -

– ఆలిండియా ఆర్యవైశ్య ఇండిస్టియలిస్ట్‌ ఫోరం సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

మేడ్‌ ఇన్‌ తెలంగాణ అనేది అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌గా మారాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆలిండియా ఆర్యవైశ్య ఇండిస్టియలిస్ట్స్‌ ఫోరం సిల్వర్‌జూబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ‘ఎకనామిక్స్‌’ అనే పదం పుట్టకముందే, మార్కెట్‌ అనే కాన్సెప్ట్‌ ప్రపంచానికి తెలియకముందే, దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన అసలైన ఆర్కిటెక్ట్‌లు ఆర్యవైశ్యులని ప్రసంసించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు స్టార్టప్‌ల గురించి మాట్లాడుతుంటే, వందల ఏండ్లక్రితమే ఎలాంటి సపోర్ట్‌ లేకుండా వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారని తెలిపారు. మారిన సాంకేతిక విప్లవ వ్యాపార ధోరణిలో వ్యాపారమే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందంటూ ‘ఈ-కామర్స్‌’ను ఉదహరించారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలకు స్వర్గధామమనీ, అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మారిందని చెప్పారు. ఆర్యవైశ్యులు వ్యాపారరంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వ్యాపారంతోపాటు ఆధ్యాత్మిక, దాన కార్యక్రమాలు వారిసొంతమని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -