Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా స్థాయి యోగ పోటీలలో మదవ్ పల్లి విద్యార్థులు

జిల్లా స్థాయి యోగ పోటీలలో మదవ్ పల్లి విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మదన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరవ జిల్లా స్థాయి యోగ పోటీలలో ప్రతిభను కనబరిచి స్వర్ణ పతకాలు సాధించారు. వారిని పాఠశాల సిబ్బంది గురువారం అభినందించారు. ఈ  సందర్భంగా పాఠశాల వ్యాయామ అధ్యాపకురాలు జి. ఇందిర మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థి ఏ. విశాల్ ట్రెడిషనల్ యోగలో,  నడుము తిప్పే యోగాసనంలో, కళాత్మక యోగాలో సింగిల్ లో స్వర్ణ పతకాలు సాధించారు. ఎన్. శరణ్య పదవ తరగతి విద్యార్థిని కళాత్మక యోగ లో స్వర్ణ పతకం, ఒంటికాలిపై యోగాసనలో వెండి పతకం సాధించింది.

అక్షర ఎనిమిదవ తరగతి విద్యార్థిని బ్యాక్ బెండ్ లో, ( సూ ఫైన్ )25 ఆసనాల యోగాలో స్వర్ణ పతకాలు సాధించారు. వెన్నెల ఏడవ తరగతి విద్యార్థిని ఫార్వర్డ్ బెండ్ లో వెండి పతకం, సౌమ్య 10 వ తరగతి విద్యార్థిని నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. ట్రెడిషనల్ ఈవెంట్లో మనుష పదవ తరగతి విద్యార్థిని నాలుగవ స్థానంలో నిలిచిందని తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినీ, విద్యార్థులు ఈనెల ఆరవ రాష్ట్రస్థాయి పోటీలు 5 ,6 ,7 తేదీలలో నిర్మల్ లో జరుగబోయే రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో  విశాల్ ,శరణ్య, అక్షర పాల్గొంటున్నారని తెలియజేశారు. పథకాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను మండల పీఅర్టియు  అధ్యక్షులు జి. నగేష్ రెడ్డి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -