Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెండ్రోజుల్లో మాధవరం అవినీతి బహిర్గతం చేస్తా

రెండ్రోజుల్లో మాధవరం అవినీతి బహిర్గతం చేస్తా

- Advertisement -

జాగృతి జనబాటలో ప్రజా సమస్యలుతెలుసుకుంటున్నాం : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత
నవతెలంగాణ – కంటోన్మెంట్‌

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అవినీతి, అక్రమాలను రెండ్రోజుల్లో ఆధారాలతో బహిర్గతం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా బుధవారం ఆమె హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో పర్యటించారు. బోయిన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కొంతసేపు గడిపారు. అనంతరం రామన్నకుంట చెరువు వద్ద మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో కవిత మాట్లాడుతూ.. జనంబాటలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో సమస్యలపై దృష్టి పెట్టామని తెలిపారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామని, ఇండ్లు, ఇండ్ల పట్టాలు లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామని అన్నారు. తమ వరకు చేయగలిగేది తాము ఒక సంస్థగా చేస్తామని తెలిపారు. ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే మాధవరం చేసిన ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా ఆమె స్పందించారు. మాధవరం చేసిన అవినీతి అక్రమాలపై రెండ్రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో పూర్తి వివరాలు, సమాధానం ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం మాధవరం మాటల్లో ప్రస్టేషన్‌ కనిపిస్తోందని, ఆయన 15ఏండ్లుగా చేసిందే తాను చెప్పానని అన్నారు. మాధ వరం వ్యక్తిగత ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. బీఆర్‌ఎస్‌లో తనను నిజామాబాద్‌ వరకే పరిమితం చేశారని, ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలిగా జనం బాటలో భాగంగా ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -