ఆర్చరీ ప్రపంచ కప్
షాంఘై (చైనా) : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 2 పోటీల్లో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. మూడేండ్ల తర్వాత విల్లు ఎక్కుపెట్టిన మధుర పసిడి పతకంతో మెరిసింది. మహిళల కాంపౌండ్ సింగిల్స్ ఫైనల్లో అమెరికా ఆర్చర్ కార్సన్ కార్హెపై 139-138తో ఉత్కంఠ విజయం సాధించింది. మూడో రౌండ్లో ఏడు పాయింట్లు సాధించిన మధుర 8-85తో వెనుకంజ వేసింది. ఆ తర్వాత వరుస రౌండ్లలో పర్‌ఫెక్ట్ స్కోరుతో 110-110తో స్కోరు సమం చేసింది. ఆఖర్లో అద్భుత గురితో మెరిసిన మధుర 139-138తో పైచేయి సాధించింది. పురుషుల కాంపౌండ్ జట్టు సైతం స్వర్ణం సొంతం చేసుకుంది. ఫైనల్లో మెక్సికోపై 232-228తో చిత్తు చేసిన అభిషేక్ వర్మ, ఓజాస్, రిషబ్ యాదవ్‌లు సమిష్టిగా సత్తా చాటారు. మహిళల కాంపౌండ్ ఫైనల్ పసిడి పోరులో అమ్మాయిలు సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నారు. జ్యోతి సురేఖ, మధుర, చికిత త్రయం బలమైన మెక్సికో చేతిలో 221-234తో ఓడారు.
మధుర పసిడి గురి
- Advertisement -
- Advertisement -