Monday, December 22, 2025
E-PAPER
Homeజాతీయంమధ్యప్రదేశ్‌ అప్పు రూ.4.65 లక్షల కోట్లు..

మధ్యప్రదేశ్‌ అప్పు రూ.4.65 లక్షల కోట్లు..

- Advertisement -

రాష్ట్ర బడ్జెట్‌ను మించడంపై మంత్రులు ఆందోళన

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అప్పు రూ.4.65 లక్షల కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం బడ్జెట్‌ రూ.4.21 లక్షల కోట్లను మించిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులపై ఆ రాష్ట్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భోపాల్‌లోని కుషాభావు థాక్రే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తర, మధ్య రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశం జరిగింది. కాగా, మధ్యప్రదేశ్‌ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రి కైలాష్‌ విజయవర్గియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అప్పు రూ.4.65 లక్షల కోట్లకు చేరినట్టు ఆయన తెలిపారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం బడ్జెట్‌ రూ.4.21 లక్షల కోట్లను అప్పులు మించిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు మధ్యప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి గణనీయంగా క్షీణించిందని మంత్రి కైలాష్‌ విజయవర్గియా అంగీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని పెంచాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాంతాల అభివృద్ధికి నగరాలు బాధ్యత వహించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. అమృత్‌ మిషన్‌, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన వంటి పథకాలకు కేంద్ర సహాయం మరింత అవసరమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -