Saturday, December 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమదురోకు రష్యా, బెలారస్‌ బాసట

మదురోకు రష్యా, బెలారస్‌ బాసట

- Advertisement -

కారకాస్‌ : ఓ వైపు వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను పదవీచ్యుతుడిని చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడలు పన్నుతుంటే మరోవైపు రష్యా, దాని మిత్రదేశమైన బెలారస్‌ కార కాస్‌కు బాసటగా నిలుస్తున్నాయి. మదురోకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం ఫోన్‌ చేసి మాట్లాడగా, అదే రోజు బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో రష్యాలో వెనిజులా రాయబారిగా పనిచేస్తున్న జీసస్‌ రాఫెల్‌ సలాజర్‌ వెలాక్వెజ్‌తో సమావేశమయ్యారు. గత 17 రోజుల వ్యవధిలో లుకషెంకో-వెలాక్వెజ్‌ మధ్య సమావేశం జరగడం ఇది రెండోసారి. మదురోకు బెలారస్‌ ఎప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుందని, ఆయన పర్యటనకు ఇదే సరైన సమయమని వెలాక్వెజ్‌కు లుకషెంకో చెప్పారు.

కాగా వెనిజులా ప్రభుత్వ విధానానికి తన మద్దతు కొనసాగుతుందని మదురోతో జరిపిన ఫోన్‌ సంభాషణలో పుతిన్‌ పున రుద్ఘాటించారు. బయటి నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో వెనిజులా ప్రయోజనాలను, సార్వ భౌమత్వాన్ని పరిరక్షిస్తానని పుతిన్‌ హామీ ఇచ్చారు. మదురోను గుర్తించ బోనని ట్రంప్‌ ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తోంది. మదురో 2013 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా కొనసాగుతు న్నారు. గత సంవత్సరం ఆయన వెనిజులా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికను అమెరికా గుర్తించడం లేదు. మదురోకు రోజులు దగ్గర పడ్డాయని ట్రంప్‌ గత వారం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వెనిజులాకు సైనిక దళాలను పంపుతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -