- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల కలిగొట్ లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా బీచ్ వాలీబాల్ ఎస్జిఎఫ్ అండర్ -17 టోర్నమెంట్లో మగ్గిడి పాఠశాల విద్యార్థిని మొదటి స్థానం సంపాదించినట్టు వ్యాయామ ఉపాధ్యాయులు గడ్డం మధు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారినీలను హెచ్ఎం హరిత ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ వీడీసీ, సర్పంచ్ తదితరులు అభినందించారు. ఈ క్రీడాకారులు ఈ నెలలో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో పాల్గొంటారని తెలిపారు.
- Advertisement -



