Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచి మహా అన్న ప్రసాద వితరణ 

రేపటి నుంచి మహా అన్న ప్రసాద వితరణ 

- Advertisement -

పులిమేడు ఆశ్రమ గురుస్వామి తాజా మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ 

బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పులిమేడు ఆశ్రమ గురుస్వామి తాజా మాజీ కౌన్సిలర్ దేశిడి  శేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బిఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈనెల 22 (బుధవారం) నుంచి మండల కాలం వరకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందన్నారు. అయ్యప్ప, శివ, ఆంజనేయ, భవాని మాత, ఇతర స్వాములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పదేవాలయ కమిటీ చైర్మన్ ముక్కాపాటి వెంకటేశ్వరరావు,సంఘసంస్కర్త, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్, వార్డు ఇన్చార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి  నాయుడు గురుస్వామి గురువారెడ్డి గురుస్వామి బాలు నాయక్ గురు స్వామి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -