Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బుద్ధి గణపతి మండపం వద్ద మహా అన్నదానం

బుద్ధి గణపతి మండపం వద్ద మహా అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని పడంపల్లి గ్రామంలో చిన్నారులు ఏర్పాటు చేసిన బుద్ధి గణపతి మండపం వద్ద శనివారం అన్నదాన ప్రసాదం పేదలకు వితరణ చేశారు. ఈ సందర్భంగా గత నాలుగు రోజులుగా విగ్నేశ్వర ప్రతిష్టాపన స్థలం వద్ద బాలలందరూ కలిసి రోజుకో రకంగా అలంకరణ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలతో ఉల్లాసంగా రోజు వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం బుద్ధి గణపతి ఆధ్వర్యంలో గ్రామస్తులు అదరికీ, పేదలకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బుద్ధి గణపతి నిర్వాహకులు బాలురు కావడంతో గ్రామస్తులు ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు. పావుడే సంజీవ్, తంబే వార్ బస్వంత్ ,  కత్తేవార్ రాజు,  శ్రీధర్ , ఆకాశే గణపతి , ఉత్తమ్ , ఈశ్వర్ గొండా, పావుడే నిఖిల్, లక్సెట్టి బాలాజీ , సిద్దయ్యప్ప, లక్షెట్టి మల్లికార్జున్, లక్షెట్టి రాజేష్ తదితరులు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -