- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో దుర్గా నగర్ కాలనీలో దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ క్రమంలో గురువారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గాంధారి మాజీ జడ్పిటిసి సభ్యుడు తానాజీ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గాంధారి మాజీ సర్పంచ్ సత్యం తదితరులు అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భవాని మాత మాలదారులు దుర్గ యూత్ సభ్యులు దుర్గా నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -