అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది
అన్నదాన దాతలు పెరుమాండ్ల కవితా ప్రభాకర్ ,పేరుమాండ్ల స్రవంతి వినస్, ఆరెల్లి విదిశా తిరుమల్
నవతెలంగాణ నెల్లికుదురు అన్ని దాన్లో కెల్లా అన్నదానం మహా గొప్పదని అన్నా దాన దాత పెరుమాండ్ల కవిత ప్రభాకర్, పెరుమాండ్ల స్రవంతి వీనస్, ఆరెల్లి విదిశా తిరుమల్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆ భగవంతుడు దీవెనలతో ఆ గ్రామము అభివృద్ధి చెందాలని పాడి పంటలు పండాలని ఆయురారోగ్యాలను ప్రజలు పొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు నలమాస అశోక్, ఉమేష్, రమేషు, ఎస్ కే అజీమ్, నవీన్, చందు , యాకన్న ,అఖిల్, యశ్వంత్, ప్రవీణ్ ,అరవింద, భాను, ప్రసాద్, సాయి, చరణ్, తదితరులు పాల్గొన్నారు.