ఎస్సై చిర్ర రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని బ్యాంకు కాలనీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై చీర రమేష్ బాబు ప్రారంభించారు. మంగళవారం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్యాంకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్యాంకు కాలనీలో ఉండేవారు కొంతమంది వినాయకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు మహా అన్నదాన కార్యక్రమాన్ని బ్యాంకు కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల వారిని అభినందించినట్లు తెలిపారు.
మండల ప్రజలు ఆయురారోగ్యాలను కలిగి రైతుల పాడి పంటలు పండి అందరు అభివృద్ధి చెందాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. వినాయకుని నిమజ్జనాలు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చివరి రోజు నిమజ్జనం ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాదిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్మి ఎర్రంశెట్టి సీతారాములు పద్మ పింగిలి రాజిరెడ్డి బొల్లపల్లి వినయ్ కుమార్ మోహన్ రెడ్డి వెన్నం మల్లారెడ్డి రాధాకృష్ణ చారి మాశెట్టి వెంకన్న మాదిరెడ్డి సంతోష్ రెడ్డి కీర్తన ముసపట్ల రఘుమోహన్ గుండపల్లి శీను నెల్లూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు కాలనీ ఆధ్వర్యంలో మహా అన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES