నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షులు పట్లోళ్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం మహాజన సభ నిర్వహించారు. కార్యదర్శి సాయి ప్రకాష్ జమ కర్చులు తదితర వివరాలను సభ్యుల సమక్షంలో చదివి వినిపించారు. బండారెంజల్, పెద్దదడ్గీ గ్రామాలలో రైతులు పండించిన వరి ధాన్యం వ్యవసాయ సహకార సంఘం ద్వారా కొనుగోలు చేయాలని విత్తనాలు ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన సోయా పంటలను కొనుగోలు చేయాలని తీర్మానించారు. డైరెక్టర్లు సంతు పటేల్, బుడాల శ్రీనివాస్, సంతోష్, భూమవ్వ, రాథోడ్ చత్రుసింగ్, పోచయ్య, పది గ్రామాల సంఘం సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
పుల్కల్ లో మహాజన సభ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES