Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆటలుమహరాజ్‌ మాయాజాలం

మహరాజ్‌ మాయాజాలం

- Advertisement -

పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
రావల్పిండి (పాకిస్తాన్‌) :
పాకిస్తాన్‌తో రెండో టెస్టులో సఫారీ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (7/102) ఏడు వికెట్ల ప్రదర్శనతో మాయాజాలం సష్టించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 113.4 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బ్యాటర్లలో షాన్‌ మసూద్‌ (87), అబ్దుల్లా షఫీక్‌ (57), సయీద్‌ షకీల్‌ (66) అర్థ సెంచరీలతో రాణించారు. సల్మాన్‌ ఆగా (45) లోయర్‌ ఆర్డర్‌లో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లో 185/4తో పోరాడుతోంది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (68 నాటౌట్‌, 184 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీతో నిలువగా.. టోనీ (55) ఫిఫ్టీతో మెరిశాడు. కెప్టెన్‌ మార్క్‌రామ్‌ (32), రియాన్‌ రికెల్టన్‌ (14), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (0) అంచనాలను అందుకోలేదు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మరో 148 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -