- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. బారామతిలో ల్యాండింగ్ వుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లుత తెలుస్తోంది. బుధవారం ఉదయం బారామతిలో జరగాల్సిన సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లెట్ ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో పవార్‌తో పాటు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. వాళ్ల క్షేమసమాచారాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
- Advertisement -



