Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ 

- Advertisement -

మౌలిక వసతుల సౌకర్యాల కోసం నిధులు మంజూరు
సద్వినియోగం చేసుకోవాలి: ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
నవతెలంగాణ – అచ్చంపేట :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చాలా ఏళ్ల తర్వాత మహర్దశ పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యపైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. గత చాలా ఏళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కాకపోవడంతో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాలలో త్రాగునీటి వసతి, ఎలక్ట్రిషన్, షానిటేషన్ మౌలిక వసతుల కోసం నాగర్కర్నూల్ జిల్లా కళాశాలలకు రూ.1 కోటి 22 లక్షల 57000 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జూనియర్ కళాశాల తిమ్మాజీపేటకు  వాటర్ సప్లై, ఎలక్ట్రిషన్, ఇతర మౌలిక వసతుల కోసం రూ. 9 లక్షల 50 వేల రూపాయలు, కల్వకుర్తి జూనియర్ కళాశాలకు మరమ్మత్తులు, ఎలక్ట్రిషన్, వాటర్ సప్లై  పనులకు రూ. 9 లక్షల 49 వేలు, కొల్లాపూర్ బాయ్స్ కళాశాలకు మరమ్మతులు, ఎలక్ట్రిషన్, వాటర్ సప్లై, పనులకు రూ. 9 లక్షల 31 వేలు, కొల్లాపూర్ బాలికల కళాశాలకు రూ.9 లక్షలు, కోడేరు జూనియర్ కళాశాలకు రూ.8 లక్షల 95వేలు, అచ్చంపేట బాలికల కళాశాలకు రూ.2 లక్షల 55 వేలు, పాలెం జూనియర్ కళాశాలకు రూ. 7 లక్షలు, నాగర్ కర్నూల్ బాలికల కళాశాలకు రూ.9 లక్షల 40 వేలు, నాగర్ కర్నూల్ బాయ్స్ కళాశాలకు రూ.10 లక్షలు, తాడూరు జూనియర్ కళాశాలకు రూ.9 లక్షల 40 వేలు, వెల్దండ జూనియర్ కళాశాలకు రూ.9 లక్షల 80 వేలు, అమ్రాబాద్ జూనియర్ కళాశాలకు రూ.4 లక్షల 10 వేలు, బల్మూర్ జూనియర్ కళాశాలకు 9 లక్షల 16వేలు, వంగూరు జూనియర్ కళాశాలకు 15 లక్షలు మొత్తం నాగర్కర్నూలు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కోటి 22 లక్షల 57,000 ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 

కళాశాలలో మౌలిక వసతులకు నిధులు ఖర్చు చేయాలి: వెంకటరమణ ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, నాగర్ కర్నూల్

 కళాశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను మౌలిక వసతులకు ఖర్చు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాలలో వసతులు సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -