పాలకుర్తి నియోజకవర్గానికి 21 కోట్లు మంజూరు
పాలకుర్తి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రుల సహాయ సహకారాలు తీసుకుంటున్నానని, అభివృద్ధిలో నియోజకవర్గం అగ్రభాగాన ఉండేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు భరోసా ఇచ్చారు. సోమవారం హైదరాబాదులో గల మైనారిటీ లు సంక్షేమ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కలిసి పాలకుర్తి నియోజకవర్గం లోని తండాలు, ఆవాస ప్రాంతాలకు లింకు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన మంత్రి లక్ష్మణ్ తండాలు, ఆవాస ప్రాంతాల లింకు రోడ్ల అభివృద్ధికి 21 కోట్ల నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి తెలిపారు.
గత పది సంవత్సరాలుగా తండాలు, గూడాలకు లింకు రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. తండాలకు, ఆవాస ప్రాంతాలకు లింకు రోడ్డు అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని మంత్రికి వివరించారని తెలిపారు. స్పందించిన మంత్రి 21 కోట్ల నిధులను మంజూరు చేస్తానని ఆమె ఇచ్చారని తెలిపారు. నిధుల మంజూరుతో తండాలకు, ఆవాస ప్రాంతాల లింకు రోడ్లకు మహార్దశ వచ్చిందని తెలిపారు. లింకు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి లక్ష్మణ్ కు పాలకుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తండాల లింకు రోడ్ల అభివృద్ధికి మహార్దశ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES