విద్య, సమానావకాశాలకు పెద్దపీట
వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
మహళోద్దరణకు మహాత్మ జ్యోతిరావు పూలే కృషి వెనకట్టలేనిదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడన్నారు. 1873 సెప్టెంబరు 24న ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశాడన్నారు.
1 2 అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చని ప్రకటించాడన్నారు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని తెలిపారు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులన్నారు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడన్నారు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడన్నారు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడన్నారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉందన్నారు. విద్య విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే అని ఎమ్మెల్యే మేగా రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదిత్య, మాజీ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం సాగర్, విభూతి నారాయణ, యాదగిరి, మధుగౌడ్, శరవంద, పరుశురాం, వినోద్ గౌడ్, టీపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంబటి రమేష్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిలీప్ గౌడ్, రాహుల్ గాంధీ సురేష్ విక్కీ పజిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


