- Advertisement -
రేగా కళ్యాణి ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
చల్వాయి గ్రామానికి చెందిన కన్నం మహేందర్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని ములుగు జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి అన్నారు. బుధవారం రేగా కళ్యాణి అనారోగ్యంతో మృతి చెందిన కన్నం మహేందర్ పార్దివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి,ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొన్నం సాయి తేజ,మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు
- Advertisement -