Sunday, February 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మరణం పట్ల మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సంతాపం

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మరణం పట్ల మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సంతాపం తెలిపారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మరణించడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందనీ, ఇలాంటి దారుణ ఘటనలు ప్రజాస్వామ్య సమాజానికి మచ్చగా మిగులుతాయని తెలిపారు. సౌమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -