Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుమైసిగండి అమ్మవారిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్

మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -

నవతెలంగాణఆమనగల్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహ ముదిరాజ్, జడ్పీ మాజీ

చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రేమ జవాహర్ లాల్ నాయక్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు సంధ్యా రెడ్డి తదితరులతో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్ ను పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలి పంతునాయక్, ఈఓ స్నేహలత, తహసీల్దార్ జ్యోతి అరుణ్, భాస్కర్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఏఎంసీ వైస్ చైర్మెన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్లు హీరా సింగ్ నాయక్, యాదగిరి రెడ్డి, లక్పతి నాయక్, మాజీ వైస్ చైర్మెన్ గుర్రం కేశవులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు ప్రభాకర్ రెడ్డి, బిచ్యా నాయక్, చేగూరి వెంకటేష్, పోతుగంటి అశోక్, జహాంగీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -