నవతెలంగాణ – మోర్తాడ్
పేదలకు అనాధలకు నిరంతరం సేవా అందిస్తున్న కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కు అత్యుత్తమసేవ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ సరస్వతి పరిషత్ కళాభవన్ లో ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఇతనికి అత్యుత్తమ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా మహేష్ కుమార్ అనాధ పిల్లలకు పేదలకు నిరంతరం సేవలందిస్తూ గుర్తింపు పొందడం చాలా సంతోషమని జస్టిస్ ఫర్ అవార్డు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ అన్నారు. ఇదే విధంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరింత గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎస్పీ సైదులు, నేషనల్ చీఫ్ జస్టిస్ రాజు, హైకోర్టు న్యాయవాది కడారి రమేష్, నోముల సంపత్, నిజామాబాద్ జిల్లా వీఆర్వో లింగం తదితరులు పాల్గొన్నారు.
అత్యుత్తమ సేవ అవార్డు అందుకున్న మహేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



