– ఘాట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లిలో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి స్వర్గీయ ఏలేటి మహిపాల్ రెడ్డి 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న మహిపాల్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన సతీమణి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, తనయుడు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ బిజెపి నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి సమాధిపై పూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించారు.
అనంతరం ఈ ప్రాంతంలో మహిపాల్ రెడ్డి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. అంతకుముందు ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఉన్న మహిపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వి. నరసింహారెడ్డి, బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, అన్ని మండలం అధ్యక్షులు, కమ్మర్ పల్లి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సోమా నరేష్, మండల ఉపాధ్యక్షులు సతీష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



