నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న హోంగార్డు పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,000 హోంగార్డు పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అవకాశం లభించనుంది. అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి.






కామెంట్‌లు (0)