- Advertisement -
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం రేగుల గూడెం సర్పంచి పాగే ఆమని సురేష్ శనివారం గ్రామంలోని పలు కాలనీలను సందర్శించారు. శుభ్రతను పాటించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. వాడవాడకు తిరుగుతూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పలు కాలనీలలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తను గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో తొలగించారు. గ్రామస్తులు పరిశుభ్రతను పాటించాలని, ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకూడదని పలు సూచనలు చేశారు. రోగాలు సంభవించకుండా చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో ఉపసర్పంచ్ పాలరపు వెంకటస్వామి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణితో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
- Advertisement -



