Saturday, September 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రిమ్స్ లో గాడితప్పిన లిఫ్ట్ నిర్వహణ

రిమ్స్ లో గాడితప్పిన లిఫ్ట్ నిర్వహణ

- Advertisement -

లిఫ్ట్ లో ఇరుక్కున్న వృద్ధురాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

రిమ్స్ ఆస్పత్రిలో లిఫ్ట్ నిర్వాహణ గాడి తప్పింది. ఇప్పటికే అనేక మార్లు మోరాయిస్తు సేవలు నిలిచిపోయి రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతుండగా… తాజాగా శనివారం సాంకేతిక సమస్య తలెత్తడంతో మద్యలోనే ఆగిపోయింది. ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్దురాలు అందులో ఇరుక్కుని ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతి కష్టం మీద గ్రిల్స్ ను తొలగించి… ఆమెను లిఫ్ట్ నుంచి బయటకు తీయడంతో ఊపిరి పీల్చుకుంది. లిఫ్ట్ లు తరుచూ మోరాయిస్తుండటంతో మెట్ల మార్గంలో పై అంతస్తులకు వెళ్లి వచ్చేందుకు రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్ట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -