Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

- Advertisement -

– మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
– రైతులతో కలిసి ర్యాలీ.. జగిత్యాల కలెక్టరేట్‌లో వినతి
నవతెలంగాణ – జగిత్యాల

జగిత్యాల జిల్లాలో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌ నుంచి సోమవారం రైతులతో కలిసి బైక్‌ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లిన జీవన్‌రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని తెలిపారు. వన్యప్రాణుల బెడద, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట సాగు చేస్తే.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యమవడంతో కనీస మద్దతు ధర రూ.2400 రైతులకు అందడం లేదన్నారు. ప్రతి ఏడాదీ ఈదురుగాలులు, వడగళ్ల వానలతో మొక్కజొన్న పంట నష్టం జరుగుతోందని, రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేకపోవడంతో రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం కారణంగా రైతులు ప్రతి క్వింటాల్‌పై సుమారు రూ.500 నష్టపోతున్నారని తెలిపారు. ఆ లెక్కన ఎకరానికి సుమారు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. సుమారు రూ.15 వేల వరకు నష్టం వస్తుందన్నారు. పంట సాగు చేసే సమయంలోనే భరోసా కల్పించేలా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -