Friday, November 21, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో భారీ భూకంపం..

బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని ఢాకా లో శుక్రవారం ఉదయం 10:08 గంటల సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరుస్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. ఢాకాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సింగ్‌డిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం బంగ్లాదేశ్‌-ఐర్లాండ్‌ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ప్రకంపనలతో కొన్ని నిమిషాల పాటూ మ్యాచ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కొనసాగించారు. అయితే, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -