తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు
సునామీ హెచ్చరికలు జారీ
మాస్కో: రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. దీంతో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం(పీటీడబ్ల్యూసీ).. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ప్రమాదమేమీ ఉండదని చెప్పింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచనలు జారీ చేశారు. భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది. వీటిల్లో 7.4 తీవ్రతతో కూడిన భూకంపంతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.
రష్యాలో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES