రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత
అనేక భవనాలు నేలమట్టం
బలికెసిర్: తుర్కియేలోని బలికెసిర్ ప్రావిన్సులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్తాంబుల్‌లోనూ భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. సిందిర్గి పట్టణంలో భూకంప కేంద్రం ఉందని, ఆ పట్టణంలో 16 భవనాలు నేలమట్టమయ్యానని పేర్కొన్నారు. భవన శిథిలాల కింద చిక్కుకొని ఓ యువతి మృతిచెందిందగా, మరో 29 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. భవన శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. మరోవైపు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆకాంక్షించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌లో పోస్టు చేశారు. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం టర్కీలో మారణహౌమాన్ని సృష్టించింది. భూకంప ధాటికి 53వేలకుపైగా ప్రజలు మృతిచెందగా, వందల్లో భవనాలు నేలమట్టమయ్యాయి.
భూకంప ధాటికి 16 భవనాలు నేలమట్టం
ప్రమాద తీవ్రత గురించి టర్కిష్ మంత్రి అలీ యెర్లికాయ విలేకర్లతో మాట్లాడారు. ఇస్తాంబుల్, పర్యాటక కేంద్రమైన ఇజ్మీర్‌తో సహా దేశంలో పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిదని పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి వెంటనే విపత్తు దళాలు చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయని చెప్పారు. భూకంప ధాటికి 16 భవనాలు కూలిపోయాయన్నారు. మూడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో అందులో ఉన్న ఆరుగురు నివాసితులు ఉన్నారని, వారిని రెస్క్యూటీం క్షేమంగా బయటకు తీశారని ఆయన తెలిపారు. అయితే ఓ 80 ఏండ్ల వృద్ధుడు శిథిలాల నుంచి వెలికి తీసిన కొద్ది సేపటికే మరణించారని చెప్పారు.
2023లో సంభవించిన భూకంప ధాటికి 53 వేల మంది బలి
తుర్కియేలో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. 2023 ఫిబ్రవరిలో నైరుతిలో సంభవించిన భూకంపం దాదాపు 53,000 మందిని బలితీసుకుంది. పురాతన నగరం ఆంటియోక్ ఉన్న అంటక్యను నాశనం చేసింది. జులైలో అదే ప్రాంతంలో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంప తీవ్రతకు ఒకరు మరణించగా, 69 మంది గాయపడ్డారు. అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో టర్కీ ఓకటని నిపుణులు చెబుతున్నారు.
టర్కీలో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES