నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘నక్సల్ రహిత భారత్’ లక్ష్యంలో భాగంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్-2’లో భాగంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ఇవాళ తెల్లవారుజామున ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కర్రెగుట్టలు మావోయిస్టులకు కీలకమైన స్థావరం కావడంతో పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. సుమారు 5 వేల మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



