- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో సునీత బెడ్ వర్క్స్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -



