నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎయిరిండియా SATS ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన షటిల్ బస్సు బే నంబర్-32 సమీపంలో ఎయిరిండియా ఫ్లైట్ వద్ద పార్క్ చేశారు. అయితే, ఉన్నట్టుండి అదే బస్సులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానానికి కొన్ని మీటర్ల దూరంలో ఉండగా.. బస్సులో మంటలు చెలరేగడం ఎయిర్‌పోర్టులో అధికారుల్లో దడ పెట్టింది. దీంతో వారు హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ఎయిర్‌పోర్టు వర్గాలు, ఫైర్ సిబ్బంది భావిస్తున్నాయి.
ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం..
- Advertisement -
- Advertisement -



