Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు

పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూప రసాయన పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం, జరిగిన సష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కొన్ని నెలల క్రితం పాశమైలారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగి పలువురు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కార్మికులకు.. వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -