- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని హయత్‌నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఆదివారం ఉదయం 6 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ యూనిట్‌లో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాంకులో జరిగిన ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



