నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్ (జీజీఎస్) కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డీఎఫ్ఎస్) అధికారుల కథనం ప్రకారం గురువారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో కాలేజీలోని గ్రంథాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 11 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. అగ్నిమాపక సిబ్బంది సత్వర స్పందనతో ఉదయం 9:40 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు డీఎఫ్ఎస్ అధికారులు వెల్లడించారు. తొలుత కాలేజీలోని మొదటి అంతస్తులో ఉన్న గ్రంథాలయంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత అవి వేగంగా రెండో, మూడో అంతస్తులకు కూడా వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి వెలువడిన దట్టమైన పొగలు, భారీ అగ్నికీలలు దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు.
కాలేజీలో భారీ అగ్నిప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES