Tuesday, April 29, 2025
Homeజాతీయంముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలోని బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజాము 4గంటలకు బాంద్రా వెస్ట్‌లోని లింక్‌ స్క్వేర్‌ షాపింగ్‌ మాల్‌ బేస్‌మెంట్‌లో ఉన్న క్రోమా షోరూమ్‌లో మంటలు అంటుకున్నాయి. అవి షో రూమ్‌ మొత్తం వ్యాపించడంతో పాటు మాల్‌ మొత్తానికి విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఉదయం 4.11 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని ముంబై ఫైర్‌ బ్రిగేడ్‌ వెల్లడించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితోపాటు పోలీసులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img