Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడంగ్‌పేట్‌ సర్కిల్లో భారీ ప్రక్షాళన!

బడంగ్‌పేట్‌ సర్కిల్లో భారీ ప్రక్షాళన!

- Advertisement -

పలువురు అక్రమార్కులపై వేటు
నవతెలంగాణ -సిటీ బ్యూరో, బడంగ్‌ పేట్‌

శంషాబాద్‌ జోన్‌ పరిధిలోని బడంగ్‌పేట్‌ సర్కిల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపారు. విధుల్లో నిర్లక్ష్యం, నిధుల అవకతవకలకు పాల్పడిన అధికారులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణ చర్యలు తీసుకున్నారు. శంషాబాద్‌ జోన్‌, బడంగ్‌పేట్‌ సర్కిల్‌-16లో ఇంజనీరింగ్‌, పారిశుధ్యం మరియు ఈవెంట్‌ సంబంధిత పనుల అమలులో భారీస్థాయిలో ఆర్థిక అవకతవకలు, విధానపరమైన ఉల్లంఘనలు, ప్రజా నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించబడింది. ఈ విచారణలో పూర్వపు బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 10 మంది అధికారులు కొన్ని అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు, కేసు పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్‌ వారిని తక్షణమే సస్పెండ్‌ చేయడం జరిగింది.

చర్యలు తీసుకోబడిన వారిలో..
1. పి. సరస్వతి, మున్సిపల్‌ కమిషనర్‌, పూర్వపు బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్‌, సర్కిల్‌-16, బడంగ్‌పేట్‌, పనిచేస్తున్నారు.
2. జ్యోతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, పూర్వపు బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రస్తుతం జల్పల్లి సర్కిల్‌, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు.
3. వెంకన్న, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, పూర్వపు బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రస్తుతం మలక్‌పేట్‌ సర్కిల్‌, ఎస్‌డబ్ల్యూఎం వింగ్‌, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు.
4. ఎ. యాదయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, పూర్వపు బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ప్రస్తుతం ఈఎన్‌సీ, పీహెచ్‌డీఎంఈలో పనిచేస్తున్నారు.
5. పి. వినీల్‌ కుమార్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, పూర్వపు బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -