Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆకుల శ్రీనివాస్ ను గెలిపించండి

ఆకుల శ్రీనివాస్ ను గెలిపించండి

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల నాయకుడు గుదే యుగేందర్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల శ్రీనివాస్ ను అధిక మెజార్టీతో గెలిపించండి అవార్డు అభివృద్ధిని పొందండి అని ఏఎంసీ డైరెక్టర్ గుగులోతు భాస్కర్ నెల్లికుదురు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుదే వీరన్న అన్నారు. గురువారం వారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తే అంత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గడప గడపకు చేరే విధంగా నిరంతరం కృషి చేస్తున్న పార్టీ అంటే అది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాలేరు మల్లేశం , యూత్ కాంగ్రెస్ మండల నాయకులు గోగుల అశోక్, సినీయర్ నాయకులు గోగుల అశోక్, భూపతి సుధాకర్, గన్న హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -