Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభగత్‌సింగ్‌ యువజన ఉత్సవాలు జయప్రదం చేయండి

భగత్‌సింగ్‌ యువజన ఉత్సవాలు జయప్రదం చేయండి

- Advertisement -

– మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపు
– 23 నుంచి మార్చి 23 వరకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

షహీద్‌ భగత్‌ సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి మార్చి 23వ తేదీ వరకు నిర్వహించబోయే యువజన ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భగత్‌సింగ్‌ స్మారక క్రీడోత్సవాల ఆహ్వాన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్‌ పోరాటపటిమ, ప్రాణత్యాగం మరువలేనిదని కొనియాడారు. భగత్‌ సింగ్‌ స్ఫూర్తిని విద్యార్థులు, యువత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన కుల, మతతత్వాన్ని వ్యతిరేకించి పోరాడారని గుర్తుచేశారు. పోరాడి త్యాగాలు చేసిన వారి చరిత్రను నేడు కొందరు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై జరుగున్న దాడికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఆహ్వాన సంఘ అధ్యక్షులు జె కే శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌ మాట్లాడుతూ భగత్‌ సింగ్‌ స్మారక క్రీడా యోజన ఉత్సవాలలో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన జయప్రదం చేయాలని కోరారు. క్రీడలు యువతలో సామాజిక, మానసిక చైతన్యాన్ని పెంచుతాయని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్‌ మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా విద్యార్థులు, యువతలో చైతన్యవంతం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. పాలక ప్రభుత్వాలు విద్యార్థులను కులం, మతం, గంజాయి మత్తులో ముంచి విద్య, ఉద్యోగాలు, వైద్యం,నిరుద్యోగ సమస్యలపై మాట్లాడకుండా చేస్తున్నాయని విమర్శించారు. భగత్‌సింగ్‌ కోరుకున్న విధంగా మతసామరస్యం కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తామని అన్నారు. విద్యార్థులు యువత వర్తమా రాజకీయ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అందరికీ విద్య, అందరికీ ఉద్యోగాలు వచ్చేవరకు ప్రభుత్వంపై పోరాడాలన్నారు. డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ నగర కార్యదర్శులు జావిద్‌, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, చెస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాడీ బిల్డింగ్‌, వ్యాస రచన, డ్రాయింగ్‌ పోటీలు టుకే రన్‌, భగత్‌ సందేశ్‌ ర్యాలీ, ముగింపు సభ కార్యక్రమలు ఉంటాయన్నారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు మహేందర్‌, శ్రీనివాస్‌రావు, కిరణ్‌, సైదులు, వీరయ్య, రాములు, కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హష్మీ, నాయకులు బాబు, నాగేందర్‌, శ్రీమాన్‌, రాజయ్య, శ్రీనివాస్‌, రజనీకాంత్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -