నవతెలంగాణ – బోనకల్
ఫిబ్రవరి 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల కార్యదర్శి, ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ కోరారు. టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల కమిటీ సమావేశం ఆ సంఘం మండల అధ్యక్షుడు గార్లపాటి చిన్న రంగారావు అధ్యక్షతన బోనకల్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ 2010 కంటే ముందు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు టేట్ నుండి మినహాయించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, నూతన విద్యా విధానము రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, ఆల్ ఇండియా జాక్టో ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో అత్యధిక మంది ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పి ఆర్ సి రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని పి ఆర్ సి ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని టీఎస్ యుటిఎఫ్ పనిచేస్తుండగా అందుకు అనుమంగా అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం చేయకుండా ప్రభుత్వ విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందితేనే విద్య వ్యవస్థ పురోగమనములో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ మండల కోశాధికారి పి నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాల్ రావు, మండల కార్యదర్శులు బి నిర్మల, యు గంగాభవాని, ఉపాధ్యాయులు స్వర్ణవిపుల, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ కె పద్మావతి, కవిత, నాగశ్రీ, మౌనిక, బి .నరసింహారావు, కే శ్రీనివాసరావు, కె.కృష్ణ ప్రసాద్,ఎల్ శ్రీనివాసరావు, రాజ వేణు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



