సీఐటీయూ నేతల డిమాండ్
నవతెలంగాణ-నసురుల్లాబాద్
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో మార్చి 16న ‘చలో హైదరాబాద్’ ధర్నా కార్యక్రమంలో విజయవంతం చేయాలని సిఐటియు నేత రవీందర్ తెలిపారు. శనివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ సిఐటియు నేత రవీందర్ మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం అనేక హామీలు ఇచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని రెండు సంవత్సరాలు అవుతున్న ఇంత వరకు పరిష్కారం కాకపోవడం సిగ్గు చెట్టుగా ఉందన్నారు.
రాష్ట్రమంత్రి సీతక్క అంగన్వాడి దీక్ష ల వద్దకు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తాం అధికారంలో వచ్చిన వెంటనే నేను పరిష్కరిస్తాన్నారు. అప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు అంగన్వాడీల సమస్యలు మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసం, ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా అంగన్వాడితో సమస్యల పైన మాట్లాడి 26 వేల వేతనం ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు వెంటనే ఇవ్వాలని, ఇప్పటి వరకు చాలామంది రిటైర్మెంట్ అయ్యారు, వాళ్లకి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు . ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళందరూ సమస్యలు అసెంబ్లీలో పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం, నిజాంసాగర్, బీర్కూర్, నసురుల్లాబాద్ మండల అంగన్వాడి టీచర్లు, వజ్ర, రాధా, సుజాత,గంగామణి, గౌరమ్మ, శివ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.



