Friday, December 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రిస్ మస్ వేడుకలను విజయవంతం చేయండి: తహశీల్దార్

క్రిస్ మస్ వేడుకలను విజయవంతం చేయండి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలతో కలిసి పండగ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినందున జుక్కల్ నియోజక వర్గ పరిధిలోని క్రైస్తవ కుటుంబాలతో కలిసి పండగ వేడుకలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరవుతున్నట్లు మద్నూర్ మండల తహసీల్దార్ ఎం.డి ముజీబ్  ఒక ప్రకటనలో తెలిపారు. 

నియోజక వర్గంలోని క్రైస్తవ కుటుంబాలు ఈ వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈనెల 27న శనివారం బిచ్కుంద మండలం కేంద్రంలోని (బాన్సువాడ రోడ్ లో గల) మున్నూరు కాపు సంఘంలో ఉదయం 12 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవ సోదరులంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -