మున్సిపల్ ప్రచారంలో మండల కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ బలపర్షిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఓటర్లను అభ్యర్దిoచారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మంథని పట్టణంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం మండల కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా నిర్వహించారు.11వ,వార్డు పొన్నాల శ్రీనివాస్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని,పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చాలా నిధులను కేటాయించడంతో అభివృద్ధి పనులను నడుస్తున్నాయన్నారు. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ తోపాటు పలువురు పాల్గొన్నారు.



