సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని శాస్త్రి నగర్ సీపీఐ(ఎం) కార్యాలయం నుండి శుక్రవారం ర్యాలీగా బయల్దేరి పట్టణంలో 18 వార్డ్ నామినేషన్ సెంటర్ కు చేరుకొని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) గా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా ఉద్యమాలకు అంకితం అన్నారు.
పేదలకు ఇండ్ల స్థలాల సమస్యలపై మంచినీటి సమస్య పైన, విదిలై ట్లు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పోరాటం చేశామన్నారు. ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించి పట్టాల కోసం పోరాడుతున్నారని తెలిపారు. 18 వార్డ్ ఓటర్లు ఆలోచించి పని చేసే సీపీఐ(ఎం) తరపున పోటీ చేస్తున్న పల్లపు వెంకటేష్ ను గెలిపించాలని కోరారు.
సీపీఐ(ఎం) గా ప్రజా సమస్యలపై నిరంతరం ఆర్మూర్ పట్టణంలో పెన్షన్ కోసం రైతుల కోసం మంచినీటి సమస్య గురించి ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. కావున భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాటం చేయటానికి మున్సిపల్ లో జరిగే అవినీతి అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజా నాయకులను కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కుతాడి ఎల్లయ్య, సాయిలు, భూమన్న, రవి ,ఓజాల భాగ్యలక్ష్మి, కుమార్, దండు గుల సాయిలు, అనిప, మస్రిత్ బేగం తదితరులు పాల్గొన్నారు.



