నవతెలంగాణ – బొమ్మలరామారం
ఈనెల 22, 23 తేదీలలో రాయగిరి గ్రామంలోని లింగ బసవ గార్డెన్లో జరిగే జిఎంపిఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలను కోరుతూ బొమ్మలరామారం మండలంలోని రామలింంగపల్లి గ్రామంలో సంబంధిత కరపత్రాలను గురువారం జిఎంపిఎస్ మండల అధ్యక్షులు బుడుమ శ్రీశైలం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్ల కాపరుల సమస్యల పరిష్కారం కోసం దశాబ్దం కాలంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి 1016, 559 జీవోల ను తీసుకొచ్చిందన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, నేషనల్ లైవ్ స్టాక్ విషయంలో గొల్ల కురుమలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, గొర్రె మేకల పెంపకానికి ప్రాతన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మచ్చని రమేష్, నాయకులు మచ్చని మల్లేష్, జినకాల సాయి, మామిండ్ల అంజయ్య, పాక బిక్షపతి, మచ్చని సత్తయ్య, మహాకాళి బాలయ్య, చల్ల శ్రీశైలం, వల్లపు మహేందర్, మచ్చని సాయి తదితరులు పాల్గొన్నారు.
జిఎంపిఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి : బుడుమ శ్రీశైలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES