నవతెలంగాణ ఆర్మూర్
పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జేసు అనిల్, కోశాధికారి చైతన్య ల ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించినారు. బార్ సభ్యులను కలిసి ఈ జనవరి 30న జరగనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ల ఎన్నికపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఆర్మూర్ బార ఆసోసియేషన్ కలిసి మెంబర్గా ఎన్నుకోవాలని ఓటు వేసి గెలిపించాలని అడ్వకేట్ భాస్కర్ మల్లెల అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలుగా సుదీర్ఘంగా న్యాయవాద వృత్తిలో ఉంటూ జిసిజి ఏ బి పి డి జె లాంటి అన్ని ఉన్నతమైన పరీక్షలకు ఉచితంగా కోచింగ్ను ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది దానితోపాటు అనేక సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యంగా ఉంటూ చురుగ్గా పాల్గొనడం జరిగింది న్యాయవాదుల హక్కుల కొరకు వారి సంరక్షణ కొరకు చట్టాల రూపకల్పనలో కీలకమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నటువంటి నాకు మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఏ ఆర్ సి రిసోర్స్ పర్సన్ శ్రీధర్ బట్టు , బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు జి జి రామ్, తెడ్డు నర్సయ్య, గంటా విప్లవ్ కిరణ్ , శ్యామ్, రాజేందర్, గణేష్, బేతు జగదీష్ , తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



