నవతెలంగాణ – తిరుమలగిరి
జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి, కోఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి ఆదేశానుసారం తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు దుబ్బాక అశోక్ గౌడ్ సమక్షంలో మంగళవారం 13వ వార్డు నుండి గంట వనజ లక్ష్మణ్, ఐదో వార్డ్ నుండి గిలకత్తుల వెంకన్న గౌడ్ లకి బి ఫారమ్స్ అందజేశారు. తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు దుబ్బాక అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించండి, వార్డులో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. సమస్యలకు భయపడే పార్టీ జనసేన పార్టీ కాదని, సమస్య ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటదన్నారు. ఎంత పెద్ద సమస్య అయినా జిల్లా నాయకత్వం దృష్టికి, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తామని, మా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మా అభ్యర్థులను గెలిపించాలన్నారు.
జనసేన అభ్యర్థులను గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



