Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సింగన బోయిన నరసింహ యాదవ్ ను గెలిపించండి

సింగన బోయిన నరసింహ యాదవ్ ను గెలిపించండి

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ యాదవ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 26వ వార్డులో సింగన బోయిన నరసింహ యాదవ్ అడ్వకేట్ ఎన్నికల ప్రచారంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్, మాదరబోయిన నరేష్ యాదవ్, తెలంగాణ స్టేట్ యూత్ బ్రిగేడ్ మేకల బాలు యాదవ్, యాదవ సంఘం నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంల నిర్వహించారు. ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్  మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో అడ్వకేట్ వృత్తిలో ఉండి అందరిని కలుపుకుపోతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే 26వ వార్డు అభ్యర్థి సింగన బోయిన నరసింహ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో  గెలిపించాలని, వివిధ పార్టీలలో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన యాదవ సోదర సోదరీమణులు నిలుచున్న ప్రతి స్థానం గెలవాలని గెలుపు కొరకు యాదవ సామాజిక వర్గం పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -