Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదిగల ఆత్మ గౌరవ ర్యాలీని జయప్రదం చేయండి..

మాదిగల ఆత్మ గౌరవ ర్యాలీని జయప్రదం చేయండి..

- Advertisement -

– ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ..
నవతెలంగాణ – ఊరుకొండ 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1న హైదరాబాదులో నిర్వహిస్తున్న హలో మాదిగ.. చలో హైదరాబాద్ మాదిగల ఆత్మగౌరవ నిరసన ర్యాలీకి మాదిగ జాతి ముద్దుబిడ్డలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ ఊరుకొండ మండల అధ్యక్షులు ధార రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ బషీర్ బాగ్ వద్ద గల బాబు జగజీవన్ రావు విగ్రహం నుండి సెక్రటేరియట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు దళితుల ఆత్మగౌరవ  ర్యాలీకీ ఊర్కొండ మండలంలోని అన్ని గ్రామాల నుండి దళిత జాతి ముద్దుబిడ్డలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి సీజే బీఆర్ గవాయిపై కాలి బూటు విసిరిన రాజేష్ కిషోర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో జరిగే ర్యాలీలో ఊర్కొండ మండలంలోని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము శ్రీను, కొమ్ము రాజయ్య, మల్లేష్, పోలే ఆంజనేయులు, కుమార్, కిరణ్, శివ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -